పూర్ణాహుతితో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది.

ఈ సంద‌ర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటలకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమ‌తి శ్రీవాణి, కంక‌ణబ‌ట్ట‌ర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా చేప‌ట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ త‌రువాత ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

Share this post with your friends