ఏడాదికొక్కసారే తెరుచుకునే నాగచంద్రేశ్వుడి ఆలయం.. ఎప్పుడు తెరుచుకోనుందంటే..

మన దేశంలో ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే ఆలయాలు ఉన్నాయి. వాటిలో మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం ఒకటి. అక్కడ నాగచంద్రేశ్వరుడు కొలువయ్యాడు. ఈ ఆలయం ఏడాదికోసారి మాత్రమే తెరుచుకుంటుంది. ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ప్రపంచంలో శివుడు సర్పపై అధిష్టించిన ఏకైక ఆలయం ఇదే కావడం. ఈ ఆలయం నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు, హారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఈ ఆలయాన్ని మూసివేస్తారు. మళ్లీ ఏడాదికే తెరుచుకుంటుంది.

ఈ ఆలయం కాల సర్ప దోషాన్ని తొలగిస్తుందట. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ జూలై 29న రానుంది. ఈ క్రమంలోనే ఏడాదంతా మూసివేసిన ఈ ఆలయాన్ని ఈ రోజున మాత్రమే తెరుస్తారు. ఈ ఒక్కరోజు లక్షల్లో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఒక్కసారి ఆలయాన్ని దర్శించుకుంటే కాల సర్ప దోషంతో పాటు నాగ దోషం వంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయని నమ్మకం.

Share this post with your friends