నేటి నుంచి ప్రారంభమైన మార్గశిర మాసం.. దీని ప్రత్యేకతేంటంటే..

కార్తీకమాసం వెళ్లిపోయింది. నేటి నుంచి మార్గశిర మాసం వచ్చేసింది. ఈ మాసానికి కూడా చాలా విశిష్టత ఉంది. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం.. వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువు’’ అని భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పారు. అంటే అత్యంత విశిష్టత గల మాసంగా మార్గశిర మాసాన్ని అభివర్ణించారు. అసలు భగవద్గీత అవతరించింది కూడా మాసంలోనే. అందుకే ఈ మాసంలో గీతా జయంతిని సైతం నిర్వహిస్తారు.

ఈ మాసానికి ఉన్న మరో ప్రత్యేకత ధనుర్మాస వ్రతం. హిందువులు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఇంకా ఈ మాసాన్ని మోక్ష మాసమని.. మోక్ష సాధన మాసమని కూడా పిలుస్తారు. ఏకాదశిలలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి కాబట్టి ఈ రోజున భక్తితో ఉపవాసం, జాగరణ చేస్తే చాలా మంచిదని పేర్కొంటారు. మోక్షద ఏకాదశి ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిగా జరుపుకుంటారు. మార్గశిరం దక్షిణాయనం చివరిభాగం.. మార్గశిర మాసం తరువాత అంటే పుష్యమాసం నుంచి ఉత్తరాయణం మొదలు అవుతుంది.

Share this post with your friends