నవదుర్గల రూపాలకు అర్థం, శక్తి, ఏంటంటే..

నవరాత్రి 2025 సందర్భంగా మనం నవదుర్గలను అత్యంత వైభవంగా పూజించుకుంటాం. దుర్గమ్మను రోజుకో రూపంలో అందంగా అలంకరిస్తారు. పశ్చిమ బెంగాల్ వైపు ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి నవరూపాలు ఏంటి? అసలు ఆ నవరూపాలకు అర్థమేంటనేది కూడా తెలుసుకుందాం. అలాగే అమ్మవారి నవదుర్గలు ఏ దుర్గ ఏ శక్తికి ప్రతిరూపమో తెలుసుకుందాం.

పాటలో వర్ణించిన నవ దుర్గల రూపాలు..

శైలపుత్రి – పర్వత శక్తి, అచంచల బలం

బ్రహ్మచారిణి – తపస్సు, నియమం, విశ్వాసం

చంద్రఘంట – నిర్భయత్వం, యోధినీ శక్తి

కుష్మాండ – సృష్టిశక్తి, జగత్ ప్రకాశం

స్కందమాత – మాతృత్వం, రక్షణ కరుణ

కాత్యాయిని – దుష్ట సంహారిణి, భయనాశిని

కాలరాత్రి – చీకటిని తొలగించే దివ్యశక్తి

మహాగౌరి – పవిత్రత, కరుణామయి రూపం

సిద్ధిదాత్రి – వరప్రదాయిని, సంపూర్ణ శుభప్రదాత

Share this post with your friends