ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అసలు అంతలా దుమారం రేపిన ఆ ప్రకటనేంటో తెలుసుకుందాం. యోగి చేసిన ప్రకటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కల్కి అవతారంపై కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ చారిత్రక నగరం. అలాగే ఆధ్యాత్మిక, పురాతన విశ్వాసాలకు నిలయం. దీని గురించి ఐదున్నర వేల సంవత్సరాల క్రితం మహర్షి వేద వ్యాసుడు శ్రీమద్ భగవత పురాణంలోనూ ఉంది. భాగవతంలో 12వ ఖండంలోని రెండవ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. నారాయణుడు 24వ అవతారమైన కల్కి సంభాల్‌లో అవతరిస్తారని మహర్షి వేదవ్యాసుడు చెప్పారు.
ఈ కల్కి అవతారం కలియుగంలో దుష్ట సంహారం గావిస్తుందట. కేలా దేవి ఆలయానికి చెందిన మహంత్ రిషిరాజ్ గిరి కూడా సీఎం యోగి వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడు రుక్మణితో కలిసి సంభాల్ మీదుగా వెళ్ళిన శ్రీమద్ భగవత్ కథను మహంత్ రిషిరాజ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహంత్ రిషిరాజ్ గిరి మాట్లాడుతూ.. కలియుగంలో ఈ ప్రదేశంలో శ్రీ మహా విష్ణువు కల్కి రూపంలో అవతరించబోతున్నాడట. సంభాల్ నగరంలో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలున్నాయని రిషిరాజ్ తెలిపారు. రిషిరాజ్ చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఆయన చెప్పినవన్నీ ఈ నగరంలో ఉన్నాయి.