ముగిసిన‌ శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ముగిశాయి. జూన్ 17 నుంచి ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 19వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రిగాయి. ఇందులో భాగంగా ఉదయం 5.30 – 6.30 గం.ల వరకు శ్రీ సుందరాజస్వామి వారి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5.45 – 6.15 గం.ల వరకు శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించారు. రాత్రి 7.00 – 8.30 గం.ల వరకు నాలుగు మాడ వీధులలో శ్రీ సుందరరాజ స్వామి వారు గరుడ వాహనంపై విహరించి భక్తులకు అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆర్జితం ఇన్పెక్టర్ శ్రీ చలపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this post with your friends