ఆ వినాయకుడి మండపానికి రికార్డ్ స్థాయిలో రూ. 474.4 కోట్ల బీమా

వినాయకచవితి వస్తోందంటేనే ఊరూ, వాడలన్నింటిలో వినాయక మండపాలు వెలుస్తాయి. కొన్ని చోట్ల భారీ ఎత్తున సెట్టింగ్ వేసి గణపతిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. వినాయకుడి మండపానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మండపాలకు ముందుగానే భారీ బీమా కవరేజ్‌ను చేయిస్తున్నాయి. ఈ ఏడాది ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్‌లో రూ. 474.4 కోట్ల బీమా పాలసీని చేయించి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ ఏ వినాయక మండపానికి ఇంత పెద్ద మొత్తంలో బీమా పాలసీ చేయించింది లేకపోవడంతో ఇదొక రికార్డ్‌గా మారింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ ఈ పాలసీని అందించింది. ఈ పాలసీ వచ్చేసి వినాయకుడికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు మండపం వద్ద సేవను అందించే స్వచ్చంద సేవకులందరికీ వర్తిస్తుంది. అలాగే పూజారులు, వంటవారు, సెక్యూరిటీ, వాలెట్ సిబ్బంది అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ మండపంలో 2023లో రూ.360.40 కోట్లు బీమా చేయించగా.. 2024లో రూ.400.58 కోట్లు, ఈ ఏడాది ఏకంగా రూ.474.4 కోట్లు బీమా చేయించడం జరిగింది. క్రమక్రమంగా వేడుక స్థాయి కూడా భారీగానే పెరిగిపోతుంది. మండపాల కోసం వెచ్చించే ఖర్చుకు ఇది ప్రతీకగా చెప్పవచ్చు.

Share this post with your friends