మరికొన్ని గంటలే డెడ్‌లైన్.. ఆమె జ్యోతిష్యం నిజమవుతుందా?

కొందరు జ్యోతిష్యులు చెప్పింది చెప్పినట్టుగా జరగకున్నా కొంత మేర మాత్రం నిజమవుతుంది. కానీ ఓ జోతిష్యురాలు చెప్పింది మాత్రం ఇప్పటి వరకూ అక్షరాలా నిజమవుతూ వచ్చింది. ఇదే ఇప్పుడు ఓ దేశస్థులి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకీ ఎవరా జోతిష్యురాలు.. ఏ దేశస్థుల వెన్నులో వణుకు పుడుతోంది? అసలామె ఏం చెప్పారు.. అంటారా? ఆమె మరెవరో కాదు.. బాగ్లేరియన్ జాతకురాలు బాబా వాంగ. ఈమె గురించి తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు. బాబా వాంగగా పిలుచుకునే ఈ జ్యోతిష్యురాలి అసలు పేరు రియో టాట్సుకి. ఆమె ఇప్పటి వరకూ చెప్పినవన్నీ నిజమయ్యాయి. తాజాగా జపాన్ గురించి ఆమె ఓ విషయం చెప్పారు.

అదేంటంటే.. రేపు అంటే జూలై 5న జపాన్ దేశానికి భారీ సునామీ ముప్పు పొంచి ఉందని.. దీని కారణంగా పెను మార్పులు సంభవిస్తాయని బాబా వెంగా ‘ది ఫ్యూచర్ ఐసా’ అనే పుస్తకంలో రాశారు. దీనిని చూసిన జపాన్ వాసులు తీవ్ర భయబ్రాంతులకు లోనవుతున్నారు. దీనికి కారణం గతంలో అంటే 2011లో జపాన్‌కు సునామీ ముప్పు పొంచి ఉందని బాబా వాంగ చెప్పారు. అది అక్షరాలా నిజమై 20 వేల మందికి పైగా ప్రజలు మరణించగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీనికి ముందు గ్రేట్ హాన్షిన్ భూకంపం లేదా కోబ్ భూకంపాన్ని కూడా ఆమె ముందుగానే చెప్పారు. 20వ శతాబ్దంలో జపాన్‌లో రెండవ అత్యంత ప్రాణాంతకమైన భూకంపం ఇదే. రేపు జపాన్‌లో మరోసారి భూకంపం రానుందని.. గతంలో కంటే ఎక్కువగా అలలు మూడు రెట్ల ఎత్తుతో ఎగిసి పడతాయని బాబా వెంగా తెలిపారు. దీంతో అంతా భయపడుతున్నారు.

Share this post with your friends