తిరుపతిలోని ఏ ఏ తేదీల్లో సీతారాముల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారంటే..

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

• జనవరి 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

• జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

• జనవరి 4, 31వ తేదీల‌లో పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

• జనవరి 18న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

Share this post with your friends