భగవద్గీతకు మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి

మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని హెచ్‌డీపీపీ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్ అన్నారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఆదివారం ఉదయం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కోణంలో మనిషి ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చెడు మీద మంచి విజ‌యం సాధించ‌డ‌మే గీతా సారాంశ‌మ‌న్నారు.
చిన్న వ‌య‌స్సులోనే భగవద్గీత శ్లోకాల‌ను శాస్త్ర‌బ‌ద్ధంగా ప‌ఠించ‌డం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించవచ్చని తెలిపారు. విజేతలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ బహుమతులు ప్రదానం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటు, చెన్నై, బెంగుళూరు నందు ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. దాదాపు 8500 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రధాన ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన నృసింహ స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అర్చకులు సైతం స్వామివారి కల్యాణాలు, వివిధ పూజా కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తున్నారు. అయితే తొలిసారిగా 2016లో నిర్వహించిన తెలంగాణ ఆటా ఉత్సవాల్లోఅమెరికాలోని మెచిగాన్‌లో శ్రీస్వామి వారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా, కెనడా, ఓమాన్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాలు, వివిధ పూజలు నిర్వహించారు.
స్వామివారి ప్రత్యేక రథం..
మారుమూల ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు యాదగిరికొండకు ఇంకా రాలేకపోతున్నారు. దీంతో సామాన్య భక్తుల చెంతకే భగవంతుడిని తీసుకువెళ్లాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించలేని భక్త జనులకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోని ప్రచార రథంపై ఈవో వెంకట్రావు దృష్టి సారించారు. రథానికి ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాంచనరసింహుడి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు స్వామివారిని పల్లెలకు తీసుకువెళ్లేందుకు దేవస్థానం ప్రత్యేకంగా రథాన్ని సిద్ధం చేసింది. ఈ స్వామివారి రథం ద్వారా పల్లెల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధం చేసింది.

Share this post with your friends