
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
08-02-2026
ఉదయం – ధ్వజారోహణం ( కుంభ లగ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
09-02-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
10-02-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
11-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
12-02-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం
13-02-2026
ఉదయం – హనుమంత వాహనం
మధ్యాహ్నం- వసంతోత్సవం (మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు)
సాయంత్రం – స్వర్ణరథం(సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు)
రాత్రి – గజ వాహనం
14-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
15-02-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
16-02-2026
ఉదయం – చక్రస్నానం(ఉదయం 9.55 నుండి 10.15 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు)
