మహాకుంభమేళాలో 4వ రాజస్నానం వసంత పంచమి నాడే.. అదెప్పుడంటే..

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా పెద్ద ఎత్తున జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు స్నానమాచరించేందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఆరు రాజస్నానాలున్నాయని తెలుసుకున్నాం కదా. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి రోజు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు రాజస్నానాలు పూర్తయ్యాయి. నాలుగవ రాజస్నానం ఎప్పుడు ఆచరించాలనేది పైనున్న లిస్ట్‌ను పరిశీలిస్తే అర్థమయ్యే ఉంటుంది. అదే వసంత పంచమి.

మహా కుంభమేళాలో నాలుగో రాజస్నానం పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున జరుగనుంది. వసంత పంచమి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 3న రానుంది. ఈ రోజున ఆచరించే రాజస్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నాలుగవ రాజ స్నానం చేయడానికి శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం. సాయంత్రం 5.23 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. వసంత పంచమి నుంచి వసంతకాలం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ప్రార్థన వల్ల సరస్వతి దేవి ఆవిర్భవించిందని చెబుతారు. వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఆరాధించడం ఆనవాయితీ.

Share this post with your friends