నవరాత్రుల్లో ఆ ఆలయంలో తాంత్రిక పూజలు.. ఎక్కడంటే..

మన దేశంలో ఓ ఆలయం ఉంది. ఈ ఆలయంలో నవరాత్రులన్ని రోజులు తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పైగా ఈ పూజలకు పురుషులు, మహిళలకు అనుమతి ఉండదు. అసలు ఆ ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. బిహార్ రాష్ట్రం ఘోస్‌రావా గ్రామంలో ‘మా ఆశాపురి’ ఆలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయం. ఇక్కడ అమ్మవారు.. ఒడిలో బిడ్డతో దర్శనమిస్తుంది. బీహార్‌లో బౌద్ధ ఆరామాలుంటాయన్న విషయం తెలిసిదే. అయితే 9వ శతాబ్దంలో బీహార్‌లోని నలంద ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ఉండేవి. దేవీ నవరాత్రుల సమయంలో రోజూ.. ఈ ఆలయంలో బౌద్ధ సన్యాసులు తాంత్రిక పూజలు నిర్వహించేవారట.

అయితే అప్పట్లో ఈ తాంత్రిక పూజలకు ఎవ్వరినీ అనుమతించేవారు కాదట. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా తాంత్రిక పూజలు జరుగుతున్నాయి. అయితే అప్పట్లో బౌద్ధ సన్యాసులు ఈ పూజలు నిర్వహించేవారట. ప్రస్తుతం పూజారులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు పూజారులు ఆలయంలోకి వెళ్లి నవరాత్రుల వేళ.. రెండు పూటలా తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. ఒక్క పూజ దాదాపు ఐదు గంటల పాటు నిర్వహిస్తారు. అయితే ఈ పూజల కారణంగా నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుందట. అందుకే ఈ పూజల సమయంలో గ్రామస్తులను ఆలయంలోకి అనుమతించరట. నవరాత్రుల్లో చివరి రోజున హోమం నిర్వహిస్తారు. ఈ తాంత్రిక పూజలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన మీదట గ్రామంలోని స్త్రీ, పురుషులను ఆలయంలోకి అనుమతిస్తారు.

Share this post with your friends