ఇంటర్‌ పరీక్షల్లో టీటీడీ కళాశాలల విద్యార్థుల ప్రతిభ

టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు శనివారం విడుదలైన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌లో 93% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 623 మంది విద్యార్థినులు పరీక్షలు వ్రాయగా, 570 మంది విజయం సాధించారు. ఇందులో 380 మంది డిస్టెన్షన్, 142 మంది ప్రథమ శ్రేణి, 42 మంది ద్వితీయ శ్రేణి ,13 మంది తృతీయ శ్రేణి సాధించారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 717 మంది విద్యార్థినులు పరీక్షలు వ్యాయగా 571 మంది (80%) విజయం సాధించారు.

ఇందులో 328 మంది డిస్టెన్షన్, 149 మంది ప్రధమ, 68 మంది ద్వితీయ, 16 మంది తృతీయ శ్రేణి పొందారు. తిరుపతిలోని ఎస్వీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌లో 84.50% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో శ్రీ వెంకట చరణ్ అనే విద్యార్థి 977 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచారు. కళాశాలలో 355 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 300 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఏ గ్రేడ్ 148, బి గ్రేడ్ 101, సీ గ్రేడ్ 34, డి గ్రేడ్ 17 మంది పొందారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ చరణ్ అనే విద్యార్థి 461 (98.08%) మార్కులతో కాలేజీ టాపర్ గా నిలిచారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 531 మంది విద్యార్థులు వ్రాయగా, 309 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఏ గ్రేడ్ – 132, బి గ్రేడ్ -108, సీ గ్రేడ్- 48, డి గ్రేడ్ – 28 మంది విద్యార్థులు పొందారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, జేఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Share this post with your friends