ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఏపీ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనితతో అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ఆమె తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ హోం మంత్రి స్వామివారి దర్శనానంతరం టీటీడీ చైర్మన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఉపమాక ఆలయ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్‌ను అనిత కోరారు.

ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్యంత ప్రాశస్త్యం గల ఉపమాక ఆలయాన్ని 2017లనే టీటీడీకి అప్పగించడం జరిగిందని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉపమాక ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకురావాలని చైర్మన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన చైర్మన్ ఆలయ అభివృద్ధికి తగు చర్యలు చేపడతామని ఆమెకు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఎం.ఎస్.రాజు, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends