ప్రారంభమైన శ్రీశైలం బ్రమరాంబికా అమ్మవారి నవరాత్రులు..

శరన్నవరాత్రి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ ఉత్సవాలు ఎంత వైభవంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది అలంకారాలలో పూజిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆసక్తికరంగా శ్రీశైలం బ్రమరాంబికా అమ్మవారు, బెజవాడ కనకదుర్గమ్మకు నిర్వహించే అలంకారాలు వేరువేరుగా ఉంటాయి.

ఇప్పటికే ఇంద్రకీలాద్రికి సంబంధించిన వివరాలు వచ్చేశాయి కాబట్టి శ్రీశైల బ్రమరాంబిక అమ్మవారికి సంబంధించిన అలంకారాల గురించి తెలుసుకుందాం.

శ్రీశైల బ్రమరాంబికా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు (సెప్టెంబర్ 22) ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని వివిధ అలంకారాల్లో అందంగా అలంకరిస్తారు. తొలిరోజున ముందుగా ఘటస్థాపన చేస్తారు. అదే రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి అమ్మవారి అలంకారాలు ఎలా ఉండనున్నాయో చూద్దాం. వరుసగా అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 30న మహాష్టమి. ఈ సందర్భంగా శ్రీశైల భ్రమరాంబికా తన రూపంలోనే దర్శనమిస్తుంది. ఇక అక్టోబర్ 1న మహార్నవమి.. ఈ రోజున అమ్మవారికి ప్రభుత్వం పట్టువస్త్రాలను సమర్పిస్తుంది. ఇక 3న విజయదశమి.

Share this post with your friends