ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మే 6వ తేదీ శ్రీ సీతా జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆలయంలోని రంగ మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తారు. ప్రత్యేకంగా సీతమ్మవారికి “వాసంతిక పూజ” మల్లె పూలతో సహస్రనామ అర్చన నిర్వహిస్తారు.
మే నెలలో విశేష పర్వదినాలు
. మే 6వ తేదీ శ్రీ సీతా జయంతి
• మే 12వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 నుండి 11:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు.
• మే 22వ తేదీ ఉదయం 6 గంటలకు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సంజీవరాయ స్వామివారికి అభిషేకం అర్చన జరుగుతుంది.