వాల్మీకిపురం రాములవారి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో గురువారం అత్యంత వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. ఉదయం 11 – 12 గంటల వరకూ శ్రీరామ పట్టాభిషేకాన్ని వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరాముని కల్యాణోత్సవం అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నాడు నిర్వహించారు. ఆ విధంగానే నిన్న శ్రీ రాములవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.

త‌రువాత‌ యాగశాల పూజ, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్నపన తిరుమంజనం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.

Share this post with your friends