గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి అభయహస్తం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం ఉదయం 8.00 గంటలకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. అనంతరం మధ్యాహ్నం 3.00 – 4.00 గంటల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు. ఇక రాత్రి 07.00 గంటలకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 07.00 గంటలకు గజ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 08.00 గం.లకు సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends