హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున వాహన సేవలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లనూ చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 08.00 గంటలకు హనుమంత వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు ఈ వాహన సేవలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గంటల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు. వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends