చంద్రప్రభ వాహనంపై వెన్న చిన్ని కృష్ణుడు అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రి 07.00 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు చంద్రప్రభ వాహనంపై వెన్న చిన్ని కృష్ణుడు అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 5.00 – 05.30 గంటల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 5.30 – 6.30 గంటల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు.

శుక్రవారం రాత్రి 07.00 గం.లకు చంద్రప్రభ ప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. జూన్ 14న అంటే నేడు అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నారు. జూన్ 14న శనివారం ఉదయం 09.00 గంటలకు రథోత్సవం జరుగుతుంది. వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends