
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేయడంతో భక్తులు సైతం ఆనందంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గం.లకు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
