శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6-9 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. ఫిబ్రవరి 4న ఉ.8 – 8.50 గంటల మధ్య ధ్వజారోహణం, రాత్రి 8-10 గంటల వరకు పల్లకి ఉత్సవం, ఫిబ్రవరి 5న ఉదయం శేషవాహనం, రాత్రి హంస వాహనం, ఫిబ్రవరి 6న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనం, ఫిబ్రవరి 7న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, ఫిబ్రవరి 8న ఉదయం సూర్య ప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 9న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు కళ్యాణోత్సవం జరగనున్నాయి.
ఫిబ్రవరి 9న రాత్రి 10.30 గంటలకు గరుడ వాహనం, ఫిబ్రవరి 10న ఉదయం 7 గంటలకు రథారోహణ, ఉదయం 9.05 గంటలకు రథగమనం, రాత్రి గజవాహనం, ఫిబ్రవరి 11న ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి అశ్వవాహనం, ఫిబ్రవరి 12న ఉదయం 7 గంటలకు వసంతోత్సవం, ఉదయం 11.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం, ఫిబ్రవరి 13న సాయంత్రం 5 గంటలకు పుష్పయాగం జరుగనుంది. వార్షిక బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 – 9 గంటల వరుకు, రాత్రి 8 – 10 గంటల వరకు వాహన సేవల్లో స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10.30 – మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ప్రతిరోజూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథలు, సంగీతం, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.