వైభవంగా శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నల్లగొండ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైశంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చెర్వుగట్టకు తరలి వచ్చిన భక్తులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. భక్తులు నిప్పుల్లో నడిచి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామివారిని పర్వత వాహనంపై మంగళ వాద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు.

అనంతరం స్వామివారికి మొదటి పూజను వీరముష్టి వంశీయులు నిర్వహించారు. ఈ పూజానంతరం అగ్ని గుండాల కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు ఓం నామశ్శివాయ అంటూ పెద్ద ఎత్తున స్వామివారి నామ జపం చేశారు. ఈ నామస్మరణలతో ఆలయ ప్రాంతమంతా మారుమోగింది. ప్రతి ఏటా కళ్యాణం తరువాత తాము పండించిన పంటను స్వామి వారికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అగ్నిగుండాలపై నడిచిన భక్తులకు పాడి పంటల విషయంలో లోటు ఉండదట. ఏడాదంతా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భక్తులు చెబుతారు.

Share this post with your friends