25 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఏప్రిల్ 25 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పరిణయోత్సవాలు మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్ 27 తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు.

25 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
25 నుంచి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఎండాకాలం కావడంతో పరిణయోత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులూ పడకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ పరిణయోత్సవాల నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేయనున్నారు. శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాలు సంద‌ర్భంగా ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Share this post with your friends