మే 11న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల‌ శ్రీ మలయప్ప స్వామివారి ఆల‌యంలో రేపు (మే 11) అంగరంగ వైభవంగా నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. శ్రీవారి ఆలయంలో ఎందుకు నృసింహ స్వామి జయంతిని ఎందుకు నిర్వహిస్తారు? అనే సందేహం రాక మానదు. అయితే ఈ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉప ఆలయంగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఆలయం కూడా ఉంది.

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Share this post with your friends