శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌య‌ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం

అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు సంబంధించి బాలాల‌యం కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభమ‌య్యాయి. మంగళవారం సాయంత్రమే ఈ కార్యక్రమానికి అంకురార్పణ నిర్వహించిన విషయం విదితమే.. కాగా బుధవారం బాలాలయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠ నిర్వ‌హించారు.

సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహించ‌నున్నారు. జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి. ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన వంటి కార్యక్రమాలను కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.

Share this post with your friends