తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీకోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగానిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవార్లఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు.

అనంతరం సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ఆలయం నుండి బయల్దేరి రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. విద్యుద్దీపాలు, పుష్పాలతోఅందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగిభక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
