
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04.00 – 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 4.30 – 6.30 గం.ల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 8 గం.లకు పల్లకీలో మోహినీ అవతారంలో స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు. శుక్రవారం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. అంతకు ముందు అంటే.. మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04 – 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు.
