13 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 12వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.
ఏప్రిల్ 20న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాల్వార్ ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.
ఏప్రిల్ 23న శ్రీ భాష్య‌కార్లవారి గంథ‌పుపొడి ఉత్స‌వం, శ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథి) తిరునక్షత్రం.
ఏప్రిల్ 28 నుండి 30వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం.

13 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం
13 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం

శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు..
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 17వ తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.
ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌.
ఏప్రిల్ 23న శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్ప‌యాగం.

Share this post with your friends