టీటీడీ డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి మహిళా డిగ్రీ మరియు పీజీ క‌ళాశాల‌(అటానమస్), శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌ (అటానమస్), శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాల(అటానమస్), ఎస్వీ ప్రాచ్య(ఓరియంటల్) క‌ళాశాల‌, ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల‌ల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికి గాను ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్న‌ట్టు టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు అక్టోబ‌రు 7 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.

శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బంది శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బందికి ఆదివారం సేలంకు చెందిన మెక్కినేశ్వరి టెక్స్టైల్స్ అధినేత శ్రీ తంగదొరై దంపతులు వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేతులమీదుగా వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.

Share this post with your friends