గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు

గ‌త కొన్ని రోజులుగా తిరుమ‌ల‌లో కురిసిన వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాలు నిండు కుండ‌ను త‌ల‌పిస్తున్నాయి. నీటి నిల్వ‌లు పూర్తిస్థాయికి చేరుకోవ‌డంతో గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద గురువారం టీటీడీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి పాల్గొని పూజ‌లు నిర్వ‌హించి జ‌ల హార‌తి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వ‌డంతో తిరుమ‌ల‌లోని గోగ‌ర్భం, ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం డ్యామ్ లు పూర్తిగా నిండాయ‌ని తెలిపారు.

మ‌రోసారి వ‌ర్షం ప‌డితే కుమార‌ధార‌, ప‌సుపుధార డ్యామ్ లు కూడా నిండిపోతాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో రోజుకు 50 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీటిని వినియోగమ‌వుతోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు 300 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయ‌ని తెలియ‌జేశారు.

జలాశయాల నీటిమట్టం వివరాలు..

1) పాపవినాశనం డ్యామ్ :- 697.05 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 5208.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

4) కుమారధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 3724.43 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 966.31 ల‌క్ష‌ల గ్యాలన్లు.

Share this post with your friends