కర్నూలు జిల్లా మంత్రాలయం పాత ఊరిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కోలాహలంగా భక్తుల సందడి. నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని రథంపై ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో అనేక మంది భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి పాత్రులవుతారు.
2024-04-06