శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో విశేష ఉత్సవాలు..

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో ప‌లు విశేష ఉత్సవాలు జ‌రుగనున్నాయి. అవేంటో చూద్దాం..

సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్శనం ఇవ్వనున్నారు.

సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ

సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు పత్రోత్సవాలు

సెప్టెంబరు 18న శ్రీ గోవింద రాజస్వామివారి గరుడ సేవ

సెప్టెంబరు 23న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

Share this post with your friends