జూన్‌లో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

ప్రతి నెలా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయాల్లో జరిగే విశేష ఉత్సవాల జాబితాను ముందుగానే ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మరో ఆలయం విశేష ఉత్సవాల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం సైతం విశేష ఉత్సవాల జాబితాను ప్రకటించింది. జూన్ 07, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు

జూన్ 11వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగింపు నిర్వహించనున్నారు. జూన్ 25న అమావాస్య సందర్భంగా ఉదయం 8.00 గంటలకు సహస్రకలశాభిషేకం, సాయంత్రం 7.00 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగింపు జరుగనుంది. జూన్ 27న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Share this post with your friends