
ప్రతి నెలలోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయాల్లో విశేష ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. తిరుమలతో పాటు దాని అనుబంధ ఆలయాల్లో ప్రతి నెలా విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. తిరుమలతో పాటు దాని అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలకు సంబంధించిన విశేషాలు ఇప్పటికే వచ్చేశాయి. అన్ని నెలల మాదిరిగా కాకుండా ముఖ్యంగా జూన్ నెలలో పెద్దగా ఉత్సవాలు ఏమీ లేవు. ఈ క్రమంలోనే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి సంబంధించిన విశేష ఉత్సవాల వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు.
జూన్ నెలలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 02 నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. జూన్ 10 వరకూ ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. జూన్ 20, జూన్ 27 తేదీలలో సాయంత్రం 06 గం.లకు శ్రీ ఆండాళ్ అమ్మవారు / శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. జూన్ 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. మే 31 నుండి జూన్ 9వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవం నిర్వహిస్తారు.
