శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం

కార్తీక మాసంలో ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో అలరారుతున్నాయి. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా అన్ని ఆలయాల్లోనూ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గురించి తెలిసిందే. స్వామివారికి శుక్రవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పోటు పేష్కార్ శ్రీ మునిరత్నం సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Share this post with your friends