మహాకుంభమేళాలో ఆకట్టుకుంటున్న బాబా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు కోటి మందికి పైగానే భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి సైతం బాబాలు, సాధువులు మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు. చిత్ర విచిత్రమైన బాబాలను జనాలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వారిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒక బాబా తలపై బార్లీ పంట సాగు చేస్తుంటే.. మరొకరు 7 అడుగుల ఎత్తుతో ఉన్నవారొకర.. 45 కిలోల బరువైన రుద్రాక్షలను ధరించిన వారొకరున్నారు. మరొరు కొన్నేళ్లుగా స్నానమే ఆచరించలేదు.

అయితే తాజాగా రష్యన్‌ బాబాగా పిలువబడే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ బాబా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. కండలు తిరిగిన దేహం, మెరిసే ముఖ వర్చస్సు, ఆరడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖవర్ఛస్సుతో అందరినీ ఆకట్టుకుంటుండటంతో ఆయనను అంతా ‘బాహుబలి బాబా’ అని పిలుస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్. ఈయన గురించి ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆయన రష్యాలో ఒక ఉపాధ్యాయుడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు. అనంతరం తన పేరును ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్‌గా మార్చుకున్నారు. చాలా కాలం పాటు భారత్‌లోనే ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివారు. ఇక్కడి నుంచి నేపాల్‌కు వెళ్లి సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. కుంభమేళా, మహాకుంభమేళా సమయంలో నేపాల్ నుంచి ఇండియాకు వస్తుంటారు.

Share this post with your friends