ప్రతి ఏడాది సిరిమానోత్సవాన్ని ప్రభుత్వ గౌరవాలతో విజయనగరంలో నిర్వహిస్తూ ఉంటారు. విజయనగరంలోని శ్రీ పైడిమాంబ సిరిమానోత్సవానికి లక్షల మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరవుతారు. దసరా తరువాత వచ్చే తొలి మంగళవారం రోజున అమ్మవారికి సిరిమాను జాతర నిర్వహిస్తారు. అంటే ఈ ఉత్సవం ఈ ఏడాది రేపు నిర్వహించనునున్నారు. పైడితల్లి దేవతకు నిర్వహించే పండుగే ఇది. సిరి అంటే సంపద, శ్రేయస్సుకు చిహ్నమైన లక్ష్మీ దేవత. మను అంటే ట్రంక్ లేదంటే లాగ్.
ఉత్సవం అంటే పండుగ. ఈ ఉత్సవంలో బాగంగా ఆలయ పూజారి మంగళవారం సాయంత్రం 60 అడుగుల పొడవైన సన్నటి చెట్టు తొర్రకి కట్టి ఉన్న కుర్చీలో కూర్చొని మూడు సార్లు కోట, ఆలయం మధ్య ఊరేగింపుగా తిరుగుతారు. ఇక ఈ చెట్టు తొర్రను ప్రతి ఏడాది వేర్వేరు ప్రదేశాల నుంచి తీసుకొస్తారు. ఆలయ పూజారికి అమ్మవారు కలలో కనిపించి చింత చెట్టు ఎక్కడుందో సూచిస్తుందట. పూజారి, ఇతరులు వెళితే ఆ ప్రదేశంలో చెట్టు కనిపిస్తుందట. ఆ చెట్టు యజమాని సైతం సంతోషంగా అమ్మవారికి ఆ చెట్టును సమర్పిస్తాడట.