వైభవంగా సిద్ధ రామేశ్వర కళ్యాణ మహోత్సవం…

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్ర శివారులోని సోమవారం శ్రీ సిద్ధ రామేశ్వర కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తుల జన సందోహం నడుమ స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సిద్ధరామేశ్వర ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దీనిని దక్షిణ కాశిగా అభివర్ణిస్తూ ఉంటారు. సిద్ధరామేశ్వరాలయం భక్తుల కొంగుబంగారంగా కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగానే స్వామివారి కల్యాణం నిర్వహించారు. కామారెడ్డి ,నిజామాబాద్ ,హైదరాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, సంగారెడ్డి ,నిర్మల్ ,ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

నిత్యం సిద్దరామేశ్వర ఆలయంలో పూజారులు పూజలు నిర్వహిస్తారు. సీతారామేశ్వర ఆలయానికి అనుబంధంగా భువనేశ్వరీ మాత ఆలయం ఉంది. ఈ ఆలయాలను భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ కమిటీ భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఆలయం విషయంలో ఓ నమ్మకం ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఇక్కడున్న మూల బావిలో స్నానం చేస్తే కష్టాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే భక్తులంతా ముందుగా మూల బావిలో స్నానమాచరించి ఆపై బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. అనంతరం భువనేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకుని, మొక్కులు చెల్లిచారు. ఒడి బియ్యం పోసి, మహిళలు ముత్తైదువలు , సిద్దరామేశ్వరుని, భువనేశ్వరి దేవిని వేడుకున్నారు.

Share this post with your friends