ముంబై వినాయకచవితి వేడుకలకు స్పెషల్. ఇక్కడ జరిగిన ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తొమ్మిది రోజుల పాటు పెద్ద ఎత్తున వినాయకుడికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనం అంటే ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ధూం ధాంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై సందడి సందడిగా నృత్యం చేస్తూ.. పెద్ద ఎత్తున శ్రీ వినాయకుడిని తలుస్తూ శోభా యాత్ర నిర్వహిస్తారు. అనంతరం గణపతిని గంగమ్మ ఒడికి చేరుస్తారు.
అయితే గణేషుడిని గంగమ్మ ఒడికి చేర్చే క్రమంలో ముంబైలో ఒక అనుకోని ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. అంధేరీ ఛా రాజా నిమజ్జనం సందర్భంగా సముద్రంలో బోటు బోల్తా పడింది. ఆ సమయంలో వినాయకుడి నిమజ్జనానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు కూడా ఉన్నారు. వారంతా విగ్రహంతో పాటే నీటిలో పడిపోయారు. దాదాపు అంతా నీటిలో ఈదుతూ అక్కడే ఉన్న కొన్ని బోట్స్ వద్దకు చేరుకోవడంతో.. ఆ బోట్స్ నీటిలో పడిన వారందరినీ ఒడ్డుకు చేర్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.