చిన్నారి కోరిక తీర్చిన శివయ్య.. మొక్కు తీర్చుకునేందుకు పాప ఏం చేసిందంటే..

పిల్లలు ఏదైనా మంచి కోరిక కోరితే శివయ్య తీర్చకుండా ఉంటాడా? అసలే భోళా శంకరుడు.. పాప డైలీ వెళ్లి భక్తితో పూజ చేస్తుంటే కరిగిపోయి.. కోరికను తీర్చాడు. అసలేం జరిగిందంటే.. బీహార్‌లోని దర్భంగాకు చెందిన 10 ఏళ్ల రియ.. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి తనకు తమ్ముడిని వరంగా ఇవ్వమని కోరుకునేది. రియా భక్తికి మెచ్చిన శివయ్య.. ఆ చిన్నారి మనసులో తమ్ముడంటే ఉన్న ఇష్టాన్ని శివయ్య గుర్తించాడో ఏమో కానీ తథాస్తు అనేశాడు. రియా తల్లిదండ్రులకు బాలుడు జన్మించాడు. తన కోరికను నెరవేర్చిన శివయ్య పట్ల రియా అమితమైన భక్తిని చాటుకుంది. రియా తన తమ్ముడికి కన్హా అని పేరు పెట్టింది.

ఉత్తరాదిలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా భాగల్పూర్‌లోని సుల్తంగంజ్‌లోని కచ్చి మార్గంలో జరుగుతున్న కావిడి ఉత్సవంలో రియా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన కోరికను నెరవేర్చిన శివయ్య కోసం కావడి పట్టింది. తల్లిదండ్రులతో పాటు కన్హాతో కలిసి 105 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవఘర్‌లోని లార్డ్ బైద్యనాథ్ ఆలయంలో శివయ్యకు ఆ నీటిని సమర్పించనుంది. ఈ కావడి ఉత్సవ మార్గంలో తన కోరికను నెరవేర్చిన శివయ్య పట్ల అమితమైన భక్తిని రియా చూపిస్తోంది. రియాను చూసిన ప్రతి ఒక్కరూ ఆ చిన్నారి భక్తికి ముగ్దులవుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆనందంగా కావడి యాత్ర చేస్తున్నట్టు రియా చెబుతోంది.

ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపథ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించాడట. తద్వారా సముద్ర మథనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుంచి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.

Share this post with your friends