
చిత్తూరు జిల్లా కలిగిరికొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మండలాభిషేకం సందర్భంగా జూలై 13న ఉదయం 06.00 – 07.30 గం.ల వరకు పుణ్యాహం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అటు తర్వాత ఉదయం 07.55 – 08.20 గంటల వరకూ ఉత్సవమూర్తిగా కళావాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం చేపడుతారు. ఉదయం 11.00 గం.లకు శాంతి కల్యాణం వైభవంగా జరుగనుంది. ఉత్సవ మూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల నడుమ కల్యాణ వేదికపైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారు ఆశీనులుకానున్నారు. పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం భక్తి పారవశ్యంతో నిండిపోనుంది.
మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాల క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 05.00 – 06.30 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారు గరుడ సేవపై ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. మండలాభిషేకం సందర్భంగా జూలై 12వ తేదీ శనివారం ఉదయం 08.00 – 12.00 గంటల వరకు పుణ్యాహం, ఉత్సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపట్టారు. సాయంత్రం 05.30 – 08.30 గంటల వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధివాసం నిర్వహించారు.
