పారే నది మధ్యలో సైకత శివలింగం..

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయ సమీపంలోనే పంచమ నది ఉంది. దాని మధ్యలో ఓ వ్యక్తి అద్భుతమైన సైకత శివలింగాన్ని రూపొందించారు. పారే నది మధ్యలో ఇసుకలో శివలింగాన్ని రూపిందించడంతో అక్కడి వచ్చిన వారంతా సైకత లింగాన్ని ఆసక్తిగా తిలకించారు. పుష్పగిరి పుణ్యక్షేత్రాన్ని భక్తులు దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఐదు నదులు కలుస్తాయి కాబట్టి దీనిని పంచమ నదిగా పిలుస్తారు.

ఈ ఆలయానికి వచ్చిన భక్తులంతా ముందుంగా పంచమ నదిలో స్నానం చేసి అనంతరం చెన్నకేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇలా చేస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. పుష్పగిరిలో ఈ పుణ్యక్షేత్రం సమీపంలోని పంచమనది మధ్యలో రాఘవేంద్ర వర్మ అనే వ్యక్తి అద్భుతంగా సైకత శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి పూజలు చేశాడు. పారే నది మధ్యలో సైకత లింగం చాలా ఆశ్చర్యకరంగా మారింది. ఆలయంలోని చెన్నకేశ్వరస్వామితో పాటు నది మధ్యలో రూపొందిన సైకత లింగాన్ని సైతం భక్తులు దర్శించుకున్నారు.

Share this post with your friends