శాస్త్రోక్తంగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ

అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజస్వంభ జీర్ణోద్ధరణ చేపట్టారు. శుక్రవారం వేకువ జామున స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అప్పటి నుంచి శాస్త్రోక్తంగా అర్చకులు స్వామివారికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. నివేదన, బలిహరణ, తోరణ ధ్వజ కుంభ ఆరాధనము, మూలవర్లకు అభిషేకం, అలంకరణ, హోమం నిర్వహించారు.

అనంతరం ప్రాణ ప్రతిష్టాహవనము, మహా పూర్ణాహుతి, నివేదన, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, అగ్ని కుండ ప్రదక్షణ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహా నివేదన, గర్భగుడిలోకి ప్రవేశం, ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ, ఆచార్య మర్యాద, తీర్థప్రసాద గోష్టి చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆగమ సలహాదారులు శ్రీమాన్ కాండూరి శ్రీనివాసాచార్య స్వామి ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ చేపట్టారు.

Share this post with your friends