తిరుమలలో శుక్రవారం రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులకు దర్శనం

వేసవి సెలవులు దాదాపు ముగిశాయి. అయినా కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. పైగా వీకెండ్స్‌లో విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే నెల 13వ తారీఖు నుండి విపరీతంగా పెరిగింది. శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చారు. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది. శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు.

అయితే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ లో వివిధ టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే మరియు జూన్ మాసాలలోని శుక్రవారాలలో దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం జరిగుతున్నది. ఒక సారి దర్శన గుణాంకాలు పరిశీలిస్తే శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది, జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం జరిగింది. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

Share this post with your friends