శ్రీనివాస కళ్యాణంతో అమరావతి పునర్నిర్మాణం

అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్ ఈవో శ్రీ జె.శ్యామల రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణం అనంతరం స్వామి వారి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

మొదటి విడతగా రూ.30 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరునుండడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం అమరావతి రైతులతో, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. శ్రీవారి కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు, మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు , రాజధాని రైతులు , వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారని తెలిపారు.

Share this post with your friends