
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయలో జరిగే దసరా వేడుకల గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఎందుకు అంత గొప్పగా నిర్వహిస్తారు? ఎంతకాలం నుంచి నిర్వహిస్తున్నారనే విషయాలను కూడా తెలుసుకున్నాం. దేవతలంతా ఇక్కడకు దసరా పండుగ సమయంలో వస్తుంటారని అక్కడి వారి నమ్మకం. అక్టోబర్ 2 నుంచి 8 వరకూ ఈ వేడుక జరుగుతుంటుంది. ఇక్కడ రావణ దహనం వంటివేమీ ఉండవు.. దేవతల సమావేశాలుంటాయి. ఈ సమయంలో కులు లోయలోని పలు గ్రామాలన్నింటి నుంచి ప్రజలు ఆకట్టుకునేలా పల్లకీలను ముస్తాబు చేస్తారు.
ఆ పల్లకీలలో అక్కడి ప్రజలంతా అందంగా అలంకరించిన పల్లకీలలో దేవతలను దాల్పూర్ మైదానాలకు డప్పు దరువుల మధ్య జానపద నృత్యాలు చేసుకుంటూ తీసుకువెళతారు. సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక, ఆహ్లాదకర వాతావరణంలో నిండిపోతూ ఉంటుంది. ఉత్సవాల్లో చివరి రోజున మాత్రం రఘునాథ్ ప్రభువును రథంపై యాత్ర నిర్వహిస్తూ దల్పూర్ మైదానానికి తీసుకొస్తారు. ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ దృశ్యం దేవతలు, మానవుల అద్భుతమైన సంగమంగా కనిపిస్తుంది.
