17న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 – 9 గం.ల మధ్య, రాత్రి 7 – 8 గంటల మధ్య జరుగనున్నాయి. 23వ తేదీన సాయంత్రం 4 – 5 గంటల మధ్య స్వర్ణ రథం, 25వ తేదీన ఉదయం 8.40 – 9.40 గంటల మధ్యన రథోత్సవం, 26వ తేదీన ఉదయం 10 – 10.20 గం.ల మధ్య చక్రస్నానం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ
18-02-2025

ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

23-02-2025
ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025
ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

26-02-2025

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

Share this post with your friends