కాయిన్ వినాయకుడిని చూసేందుకు క్యూ కడుతున్న జనం..

దేశ వ్యాప్తంగా రకరకాల వినాయకులు పూజలు అందుకుంటున్నారు. ఊరు, వాడ ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఒక్కో చోట ఒక్కో వెరైటీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ముందుగానే నిర్వాహకులు తమ క్రియేటివిటీనంతా బయటకు తీసి మరీ విగ్రహాలను రూపొందిస్తారు. కొందరు మాత్రం తమకు కావల్సిన రీతిలో చెప్పి మరీ విగ్రహాన్ని తయారు చేయించుకుంటూ ఉంటారు. ముంబైలో అత్యంత కాస్ట్లీ వినాయకుడు కొలువు దీరిన విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల అంత భారీగా కాకున్నా మొత్తానికి అయితే డబ్బులతో విగ్రహాలను తయారు చేయించారు. అవి చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

యాదాద్రి జిల్లా భువనగిరిలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాయిన్ గణపతి రూపొందాడు. ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల కాయిన్లతో ఇక్కడి వినాయకుడిని రూపొందించడం జరిగింది. మొత్తంగా ఇక్కడి వినాయకుడి రూపకల్పనలో 30 వేల రూపాయల కాయిన్స్‌ను వినియోగించారు. ఇక్కడి యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా వెరైటీ వినాయకుడిని ప్రతిష్టిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈసారి కాయిన్స్‌తో వినాయకుడిని రూపొందించడం జరిగింది. 10 రోజుల పాటు శ్రమించి వినాయకుడి ప్రతిమను రూపొందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కాయిన్ వినాయకుడిని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు.

Share this post with your friends